శ్రీదేవి మరణ వార్తలు... టీవీ ఛానల్స్ పై మండిపడ్డ రిషి కపూర్

  • శ్రీదేవిని మృతదేహంగా ప్రస్తావించడంపై మండిపాటు
  • ఇంత దారుణమా అంటూ ఆగ్రహం
  • సరైన పద్ధతి కాదంటూ అసహనం
శ్రీదేవి మరణం గురించి టీవీ ఛానళ్లు టెలికాస్ట్ చేస్తున్న తీరుపై బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మండిపడ్డారు. మొన్నటి వరకు శ్రీదేవిగా ఉన్న ఆమె... హఠాత్తుగా 'బాడీ (మృతదేహం)' అయిపోయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి మృతదేహం ముంబై చేరుకుంటుంది అంటూ అన్ని చానళ్లు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయిన వెంటనే... సదరు వ్యక్తిని మనిషిగా కాకుండా కేవలం శరీరంగా ప్రస్తావిస్తారా? అంటూ ట్వీట్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. తన సహనటులు ఎవరైనా చనిపోయినప్పుడు సరైన గౌరవాన్ని ఇవ్వకపోతే రిషి కపూర్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏప్రిల్ లో వినోద్ ఖన్నా చనిపోయినప్పుడు కూడా ఆయన కుర్ర యాక్టర్లపై విరుచుకుపడ్డారు. ఈ తరానికి చెందిన ఒక్క నటుడు కూడా వినోద్ ఖన్నాను చివరిచూపు చూసుకోవడానికి రాలేదని... పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని... సిగ్గుపడాల్సిన విషయమని అప్పుడు ఆయన మండిపడ్డారు.
Go Back to Shorts
Sridevi
rishi kapoor

More Telugu News